38 ఏళ్లకే.. WWE స్టార్ బ్రాన్సన్ కన్నుమూత
ABN , Publish Date - Nov 28 , 2026 | 10:51 AM
ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(WWE) స్టార్ బ్రాన్సన్ రీడ్ కన్నుమూశారు. ఆస్ట్రేలియాకు చెందిన రీడ్.. 38 ఏళ్ల వయసులోనే అనారోగ్య కారణాలతో మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(WWE) స్టార్ బ్రాన్సన్ రీడ్ కన్నుమూశారు. ఆస్ట్రేలియాకు చెందిన రీడ్.. 38 ఏళ్ల వయసులోనే అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈ విషయాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ ఆర్గనైజేషన్ ధ్రువీకరించింది. రీడ్ అసలు పేరు జెర్మైన్ హేలీ. నవంబర్ 7న సౌదీ అరేబియా వేదికగా జరిగిన ‘క్రౌన్ జెవెల్’ ఈవెంట్‌లో బరిలోకి దిగాడు. ఇంతలోనే రీడ్ మరణవార్త రావడంతో రెజ్లింగ్ అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
నవంబర్ 7న సౌదీ అరేబియాలో జరిగిన క్రౌన్ జెవెల్ ఈవెంట్ సందర్భంగా రీడ్ గాయపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ లైవ్ ఈవెంట్‌లో మరో రెజ్లర్ ఆయనను పైకెత్తి టేబుల్‌పై పడేయడంతో తీవ్రంగా గాయపడినట్లు, దీంతో అతడు సౌదీ అరేబియాలోనే ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంపై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ.. గాయాల వల్ల రీడ్ చనిపోలేదని స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో బైసెప్స్ కండరానికి గాయం కావడంతో రీడ్ కొద్దికాలం రెజ్లింగ్‌కు దూరంగా ఉన్నాడు. సెప్టెంబర్‌లో తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ విరామ సమయంలో శారీరక దృఢత్వంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో తిరిగి వచ్చినట్లు కథనాలు పేర్కొన్నాయి. అలా మళ్లీ WWEలో చురుగ్గా పాల్గొంటున్న సమయంలోనే అతడి మరణవార్త రావడం అభిమానులను కలచివేసింది. కేవలం 38 ఏళ్ల వయసులోనే బ్రాన్సన్ రీడ్ మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా రెజ్లింగ్ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన రీడ్ 2007లో రెజ్లింగ్ కెరీర్ ప్రారంభించారు. 2019లో WWEలోకి ఎంట్రీ ఇచ్చి 2021లో ‘NXT నార్త్ అమెరికా ఛాంపియన్‌షిప్’ను గెలుచుకున్నారు. రీడ్ భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. అంతకుముందు వారికి కుమార్తె ఉంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2027: ఎంఐ వైస్ కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిన బుమ్రా!
భారత్‌తో రెండో టెస్టు: ఆకాశ్ దీప్ ‘ఫైఫర్’.. 356 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్