Share News

న్యూజిలాండ్‌తో టెస్టు: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోర్ 116/6

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:05 AM

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. 46 ఓవర్లకు భారత్ 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌తో టెస్టు: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోర్ 116/6
India vs New Zealand

ఇంటర్నెట్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. 46 ఓవర్లకు భారత్ 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. అంతకుముందు కివీస్ 356 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఇంకా 240 పరుగుల వెనుకంజలో ఉంది.


యశస్వి జైస్వాల్(0) విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్(25), దేవదత్ పడిక్కల్(21), శుభ్‌మన్ గిల్(17), రిషభ్ పంత్(23), వాషింగ్టన్ సుందర్(10) స్వల్ప స్కోరుకే ఔటయ్యారు. ధ్రువ్ జురెల్(7*) క్రీజులో ఉన్నాడు. కాగా న్యూజిలాండ్ బౌలర్లలో జెమీసన్ 2, డఫీ 2, హెన్రీ, నాథన్ స్మిత్ తలొక వికెట్ చొప్పున పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

38 ఏళ్లకే.. WWE స్టార్ బ్రాన్సన్ కన్నుమూత

బుమ్రా బౌలింగ్‌లో మార్పు.. టీమిండియాకు ఇది మంచిది కాదు: ఆకాశ్ చోప్రా

Updated Date - Nov 28 , 2026 | 11:13 AM