Share News

సిగ్నేచర్ సెలబ్రేషన్స్.. నిషేధం మాత్రం పడకుండా చూసుకుంటా: ఎల్ఎస్‌జీ ప్లేయర్ దిగ్వేశ్

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:01 PM

ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న దిగ్వేశ్.. ప్రతి సీజన్‌లోనూ వివాదాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా నిలుస్తుంటాడు. ముఖ్యంగా వికెట్ పడగొట్టిన ప్రతిసారీ ఏదో సిగ్నేచర్ చేస్తున్నట్లు సంబరాలు చేసుకునేవాడు.

సిగ్నేచర్ సెలబ్రేషన్స్.. నిషేధం మాత్రం పడకుండా చూసుకుంటా: ఎల్ఎస్‌జీ ప్లేయర్ దిగ్వేశ్
Dwigesh Rathi

ఇంటర్నెట్ డెస్క్: దిగ్వేశ్ రాఠీ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా! ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న ద్విగేశ్.. ప్రతి సీజన్‌లోనూ వివాదాలకు కేరాఫ్‌గా అడ్రస్‌గా నిలుస్తుంటాడు. ముఖ్యంగా వికెట్ పడగొట్టిన ప్రతిసారీ ఏదో సిగ్నేచర్ చేస్తున్నట్లు సంబరాలు చేసుకునేవాడు. ఈ విషయంలో గతేడాది అభిషేక్ శర్మతో కాస్త ఘర్షణ వాతావరణమూ తలెత్తింది. పలుమార్లు జరిమానాను ఎదుర్కొన్న దిగ్వేశ్.. ఓ మ్యాచ్ సస్పెన్షన్‌కు కూడా గురయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్‌లో ఆడుతున్న నేపథ్యంలో దిగ్వేశ్.. తన సిగ్నేచర్ సంబరాలపై స్పందించాడు.


‘నేను ఇక్కడ ఏ ప్లేయర్‌నూ అవమానించడం లేదు. నా ఉద్దేశం కూడా అది కాదు. ఎవరూ కూడా నా సంబరాలను ఆపలేరు. ఏ బ్యాటర్ అయినా సెంచరీ చేసిన తర్వాత బ్యాట్‌పై తమ హెల్మెట్ పెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటారు కదా.. అలాగే నేను కూడా ఇలా సంబరాలు చేసుకుంటా. రిషభ్ భాయ్, మేనేజ్‌మెంట్ మాత్రం నాకు ఓ సూచన చేశారు. నేను ఎలాంటి స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకున్నా.. నిషేధం మాత్రం పడకుండా చూసుకోమని చెప్పారు. నేను అదే పాటిస్తా’ అని దిగ్వేశ్ తెలిపాడు.


ఒకే సీజన్‌లో మూడుసార్లు ఉల్లంఘనలకు పాల్పడినందుకు దిగ్వేశ్‌పై భారీ జరిమానా పడింది. తొలుత 25శాతం జరిమానా.. తదుపరి రెండుసార్లు 50శాతం చొప్పున ఫైన్ పడింది. ఒక మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా పడిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: గుజరాత్‌తో పంజాబ్ ఢీ.. పిచ్ రిపోర్ట్ ఇదే!

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

Updated Date - Mar 31 , 2026 | 04:42 PM