విషాదం.. ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Mar 31 , 2026 | 03:34 PM
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ.. ఓ విషాద ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న జాన్ విలియన్ అనుమానాస్పదంగా మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ.. ఓ విషాద ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న జాన్ విలియమ్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ముంబైలోని ఓ హోటల్ గదిలో ఆయన ప్రాణాలు విడిచారు. మృతికి గల కారణాల తెలియరాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మార్చి 24న జాన్ విలియమ్ ముంబైలోని ఓ హోటల్‌కు వచ్చారు. మార్చి 29న ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ఆయన వాంఖడే స్టేడియంలోనే ఉన్నారు. మ్యాచ్ అనంతరం హోటల్ రూమ్‌కు వచ్చారు. అయితే 30వ తేదీ నుంచి రిసెప్షన్ వాళ్లు ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేసినా జాన్ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది ఎమర్జెన్సీ కీతో గదిని తెరిచి చూశారు. కాగా జాన్ విలియన్ గదిలో పడిపోయి ఉన్నారు. వెంటనే హోటల్ డాక్టర్‌ను పిలిపించి పరీక్షించారు. అప్పటికే జాన్ మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించాడు. ఆయన మృతికి స్పష్టమైన కారణాలు, ఆధారాలు లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే ఇదే తరహాలో 2020లో ప్రముఖ వ్యాఖ్యాత డీన్ జాన్స్ కూడా మృతి చెందారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: గుజరాత్‌తో పంజాబ్ ఢీ.. పిచ్ రిపోర్ట్ ఇదే!
అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్