ఐపీఎల్ 2026: గుజరాత్‌తో పంజాబ్ ఢీ.. పిచ్ రిపోర్ట్ ఇదే!
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:09 PM
మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, గతేడాది రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో శుభారంభంపై దృష్టి పెట్టాయి. నేడు జరిగే పోరులో శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని టైటాన్స్‌ను శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉన్న పంజాబ్ తలపడుతుంది.
స్పోర్ట్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026 భాగంగా ఇప్పటి వరకు జరిగినా మూడు మ్యాచుల్లోనూ ఛేజింగ్ జట్లే విజయం సాధించాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ(మంగళవారం) గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోరుకు సిద్ధమయ్యాయి. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ పోరులో మంచి ఆరంభం లభించి.. విజయం సాధించాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి.
గతేడాది శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సీజన్‌లో, ఇవాళ గుజరాత్‌తో జరిగే పోరులో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నారు. మరోవైపు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే.. రెండవ టైటిల్‌ను అందుకోవాలనే కసితో ఆ జట్టు మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఆరుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. మూడుసార్లు గుజరాత్, మూడుసార్లు పంజాబ్ గెలిచి సమఉజ్జీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ముల్లన్‌పూర్ పిచ్ నివేదిక:
ముల్లన్‌పూర్ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్‌పై అధిక స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ మ్యాచ్‌పై వర్ష ప్రభావం ఉండదని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కురిసే అవకాశం చాలా తక్కువ ఉందని, వాతావరణం తేమతో కూడి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్
ఆ భయంతో త్వరగా నిద్రపోయాను: వైభవ్ సూర్యవంశీ