ఐపీఎల్2026: అభిషేక్ శర్మ, రైనాల రికార్డును బ్రేక్ చేసిన వైభవ్...
ABN , Publish Date - Mar 31 , 2026 | 07:41 AM
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ అరుదైన ఫీట్ సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ (IPL)2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన ఐపీఎల్ ఫిట్ అందుకున్నాడు. అభిషేక్ శర్మ, సురేశ్ రైనాల రికార్డును ఈ యువ హిట్టర్ బ్రేక్ చేశాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గువాహటిలో నిన్న జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా తలో 2 సాధించగా బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్ (43), కార్తీక్ శర్మ (18), సర్ఫరాజ్ ఖాన్ (17) డబుల్ డిజిట్ స్కోర్‌ను అందుకున్నారు. ఆఖర్లో ఓవర్టన్ పోరాడటంతో చెన్నై ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది.
అనంతరం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) (17 బంతుల్లో 52) విధ్వంసకర అర్ద సెంచరీతో ధాటికి రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 38 నాటౌట్), కెప్టెన్ రియాన్ పరాగ్ (11 బంతుల్లో 14 నాటౌట్) కూడా రాణించారు. మధ్యలో జురెల్ (9 బంతుల్లో 18) సైతం అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
అభిషేక్ రికార్డ్ బ్రేక్:
ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేయడంతో సురేశ్ రైనా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ వంటి ఐపీఎల్ దిగ్గజాల వేగవంతమైన అర్ధశతకాల రికార్డును బ్రేక్ చేశాడు. అభిషేక్, ఇషాన్ కిషన్, ట్రావిస్ గతంలో 16 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. తాజాగా వారి రికార్డును వైభవ్ అధికమించాడు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. అతడు ఐపీఎల్ 2023 సీజన్‌లో కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్2026: అభిషేక్ శర్మ, రైనాల రికార్డును బ్రేక్ చేసిన వైభవ్...
‘వైభవం’గా బోణీ.. చెన్నైపై రాజస్థాన్ ఘన విజయం..