Share News

వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ.. సీఎస్కేపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

ABN , Publish Date - Mar 30 , 2026 | 10:51 PM

ఆది నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన రాజస్థాన్ జట్టు.. సీఎస్కేపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. 128 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. 12.1ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది.

వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ.. సీఎస్కేపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
Rajasthan Royals

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఆది నుంచి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన రాజస్థాన్ జట్టు.. సీఎస్కేపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. 128 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. 12.1ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(52) కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు.


ఓపెనర్ యశస్వి జైస్వాల్(38*; 36 బంతుల్లో 1 సిక్స్, 3 ఫోర్లు), ధ్రువ్ జురెల్(18; 9 బంతుల్లో 4 ఫోర్లు), రియాన్ పరాగ్(14*; 11 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్) చెలరేగి ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు తీశాడు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన సీఎస్కే.. 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి బ్యాటర్లు ఎవరూ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు.


సంజు శాంసన్(6), రుతురాజ్ గైక్వాడ్(6), ఆయుశ్ మాత్రే(0), మాథ్యూ షార్ట్(2), శివం దూబే(6), నూర్ అహ్మద్(1), హెన్రీ(5) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. సర్ఫరాజ్ ఖాన్(18), కార్తిక్ శర్మ(18) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. జెమీ ఓవర్టన్(43) ఒంటరి పోరాటం చేశాడు. అతడి వల్లే సీఎస్కేకి ఆ మాత్రం స్కోర్ అయినా లభించింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, నండ్రే బర్గర్ 2, రవీంద్ర జడేజా 2, బ్రిజేష్, సందీప్, రవి బిష్ణోయ్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

భారత ఫుట్‌బాల్ చీఫ్ నన్ను వేధించాడు.. మాజీ సీఎం కుమార్తె సంచలన ఆరోపణలు

కేకేఆర్-ఎంఐ మ్యాచ్: బౌలింగ్ చేయని కామెరూన్ గ్రీన్.. కెప్టెన్ రహానె స్పందనిదే!

Updated Date - Mar 30 , 2026 | 10:51 PM