Share News

భారత ఫుట్‌బాల్ చీఫ్ నన్ను వేధించాడు.. మాజీ సీఎం కుమార్తె సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:16 PM

ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ కల్యాణ్ చౌబేపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఏఐఎఫ్ఎఫ్ మహిళల ఫుట్‌బాల్ కమిటీ ఛైర్మన్, గోవా మాజీ ముఖ్యమంత్రి కుమార్తె వాలంకా అలెమావో వేధింపుల ఆరోపణలు చేశారు.

భారత ఫుట్‌బాల్ చీఫ్ నన్ను వేధించాడు.. మాజీ సీఎం కుమార్తె సంచలన ఆరోపణలు
Valanka Alemão

ఇంటర్నెట్ డెస్క్: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ కల్యాణ్ చౌబేపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఏఐఎఫ్ఎఫ్ మహిళల ఫుట్‌బాల్ కమిటీ ఛైర్మన్, గోవా మాజీ ముఖ్యమంత్రి కుమార్తె వాలంకా అలెమావో వేధింపుల ఆరోపణలు చేశారు. మార్చి 29న ఢిల్లీలోని ఫుట్‌బాల్ హౌస్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. తనను సీనియర్ అధికారులు హేళన చేశారని, వేధించారని వాలంకా ఆరోపించారు. అయితే భారత మహిళల ఆసియా కప్ క్యాంపెయిన్‌లో భాగంగా పాలనాపరమైన లోపాలను ఇటీవల ఆమె ఎత్తిచూపిన నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం.


కల్యాణ్ చౌబే, ఇతర సీనియర్ అధికారుల చర్యలను ప్రస్తావిస్తూ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌కు అలెమావో లేఖ రాశారు. ‘చౌబే, ఏఐఎఫ్ఎఫ్ ఉపాధ్యక్షుడు ఎన్.ఎ. హారిస్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం.సత్యనారాయన్ ప్రవర్తన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నా గొంతు అణచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కల్యాణ్ చౌబే నాతో అగౌరవంగా ప్రవర్తించారు. ఆయనతో కలిసి మిగిలినవారు స్వరం పెంచి, బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. సమావేశం జరుగుతున్నంతసేపు నన్ను టార్గెట్ చేశారు’ అని ఆమె ఆరోపించారు.


ఇవి కూడా చదవండి:

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!

ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్

Updated Date - Mar 30 , 2026 | 04:16 PM