ఆ భయంతో త్వరగా నిద్రపోయాను: వైభవ్ సూర్యవంశీ
ABN , Publish Date - Mar 31 , 2026 | 09:54 AM
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌ను రికార్డుల వేటను ప్రారంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ రికార్డుతో తన వేటను ఆరంభించాడు. ఈ మ్యాచ్‌లో ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌ను రికార్డుల వేటను ప్రారంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ రికార్డుతో తన వేటను ఆరంభించాడు. ఈ మ్యాచ్‌లో ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. అతిపిన్న వయసులో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇది ఇలా ఉంటే.. సీఎస్‌కే మ్యాచ్ అనంతరం తనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వైభవ్ వెల్లడించాడు. మార్చి 27న తన పుట్టిన రోజు వేడుకను కూడా చేసుకోలేదట. అందుకు గల కారణాలను కూడా అతడు వెల్లడించాడు.
'చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకంగా ఏమీ చేసుకోలేదు. నా కోసం కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఆ కేకును నాకు పూసేస్తారని భయపడ్డాను. దాని నుంచి తప్పించుకునేందుకు త్వరగా నిద్రపోయాను. అలా నా పుట్టినరోజు సాధారణంగానే గడిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నేను కొత్తగా ఏమీ చేయలేదు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడటమే నా లక్ష్యం. ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త బ్యాటింగ్‌కు కష్టమనిపించింది. కానీ, బంతి పాతబడిన కొద్దీ ఈజీగా మారిపోయింది. అందరిలా నేను కూడా డిఫెన్స్ గురించి ఆలోచిస్తుంటాను' అని వైభవ్ తెలిపాడు.
'ఈ మ్యాచ్‌లో మాత్రం పవర్‌ప్లేలోనే ఆధిపత్యం ప్రదర్శించాలని భావించాం. లక్ష్యం చిన్నదైనప్పటికీ ప్రత్యర్థి బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బంతులేస్తే పెద్దదిగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే, పవర్‌ప్లేలో చాలా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాం. మా కోచ్‌లు నా సహజసిద్ధమైన ఆటను ఆడాలని చెబుతారు. ప్రతి బంతి తర్వాత నా సహచర ఆటగాడు యశస్వి జైస్వాల్ మాట్లాడుతూనే ఉంటాడు. అతడే సింగిల్స్ తీసి.. స్ట్రైకింగ్ ఇచ్చాడు. భారీ షాట్లు కొట్టేందుకు ప్రోత్సహించాడు’ అని వైభవ్ సూర్యవంశీ వెల్లడించాడు. చెన్నైపై విజయంతో ఐపీఎల్ 2026ను ఘనంగా ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 4న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్2026: అభిషేక్ శర్మ, రైనాల రికార్డును బ్రేక్ చేసిన వైభవ్...
‘వైభవం’గా బోణీ.. చెన్నైపై రాజస్థాన్ ఘన విజయం..