భళా..శీతల్
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:28 AM
అసాధారణ విజయాలతో అదరగొడుతున్న భారత పారా ఆర్చర్ శీతల్‌దేవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. గతేడాది అత్యుత్తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించినందుకు....
‘పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసిన వరల్డ్ ఆర్చరీ
లుజాన్: అసాధారణ విజయాలతో అదరగొడుతున్న భారత పారా ఆర్చర్ శీతల్‌దేవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. గతేడాది అత్యుత్తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించినందుకు ‘పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్’గా ఆమె ఎంపికైంది. ఈ విషయాన్ని వరల్డ్ ఆర్చరీ సోమవారం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 19 ఏళ్ల శీతల్ ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ మెగా పోటీలలో స్వర్ణం సాధించిన చేతుల్లేని తొలి మహిళా ఆర్చర్‌గా నిలిచింది. ‘ప్రపంచంలోని ఉత్తమ ఆర్చర్లతో పోటీపడి ఉత్తమ ఆర్చర్ అవార్డు గెలుచుకోవడం గొప్ప అనుభూతినిస్తోంది’ అని శీతల్‌దేవి ఎక్స్‌లో స్పందించింది.