Shreyas Iyer Smashes: విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన అయ్యర్... ఏకంగా..
ABN , Publish Date - Jan 06 , 2026 | 03:39 PM
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. దాదాపు మూడు నెలల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో రీ ఎంట్రీ ఇచ్చాడు. హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 35 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని ముంబై జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబై స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తొలి మ్యాచ్ లోనే దుమ్ములేపాడు. తీవ్ర గాయం కారణంగా మూడు నెలల పాటు ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer).. ఇవాళ(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్ తో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy 2025 26) టోర్నీలో రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. కేవలం 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఇవాళ(మంగళవారం) జైపూర్ వేదికగా హిమాచల్ ప్రదేశ్, ముంబై జట్టు(Mumbai vs Himachal Pradesh) మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హిమాచల్ ప్రదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 33 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. వాతావరణం అనుకూలించకపోవడంతో మ్యాచ్ ను 33 ఓవర్లకు కుదించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) (82), ముఖేష్ ఖాన్(73) అర్ధ సెంచరీలతో రాణించి.. ముంబై భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
యశస్వి జైస్వాల్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 24, సర్ఫరాజ్ ఖాన్ 21, శివం దూబే 20 పరుగులు చేశారు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, అభిషేక్ కుమార్, కుషల్ తలో మూడు వికెట్లు తీశారు. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ తర్వాత జనవరి 8న పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటాడు. ముంబై రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ పిక్క గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో ఆ బాధ్యతలను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) శ్రేయస్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్‌ను నిలబెట్టిన ధీరుడు.. హ్యాపీ బర్త్‌డే పాజీ!
నా ఫొటోలను మార్ఫింగ్ చేయొద్దు: భారత స్టార్ మహిళా క్రికెటర్