Share News

Aman Rao Double Century: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..

ABN , Publish Date - Jan 06 , 2026 | 02:47 PM

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో హైదరాబాదీ ప్లేయర్ అమన్ రావ్ అదరగొట్టాడు. మంగళవారం బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేశాడు. అంతేకాక మ్యాచ్ చివరి వరకు ఉండి.. హైదరాబాద్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

Aman Rao Double Century: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..
Hyderabad batter Aman Rao

ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హ‌జారే ట్రోఫీ (Vijay Hazare Trophy 2025 26)లో హైద‌రాబాదీ బ్యాట్స్‌మన్ అమ‌న్ రావ్ చెలరేగి ఆడాడు. మంగళవారం రాజ్‌కోట్‌లో బెంగాల్ తో జ‌రిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు.154 బంతుల్లో 200 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. రీసెంట్ గా ఐపీఎల్‌ వేలంలో అమన్(Aman Rao double century)ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సొంతం చేసుకుంది. లిస్ట్-ఏ మ్యాచుల్లో అతడికి ఇదే తొలి సెంచరీ కూడా కావడం గమన్హారం. ష‌మీ, ఆకాశ్ దీప్‌, ముఖేశ్ కుమార్ లాంటి టీమిండియా బౌల‌ర్లు ఉన్న బెంగాల్ జ‌ట్టుపై అమ‌న్ రావ్ డ‌బుల్ సెంచ‌రీ కొట్టడం విశేషం.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విజయ్ హజారే టోఫ్రీ(Vijay Hazare Trophy 2025 26)లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా మంగళవారం హైదరాబాద్, బెంగాల్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన బెంగాల్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్(Hyderabad) జట్టు నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్లు కోల్పోయి.. 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ గా దిగిన అమన్ రావ్ పేరాల(Aman Rao) బెంగాల్ బౌలర్లపై విరుచకుపడ్డాడు. 154 బంతుల్లో 200 పరుగులు చేశాడు. చివరి వరకు ఉండి లాస్ట్ బంతిని సిక్సర్ మలిచి.. ద్విశతం సాధించాడు.


రాహుల్ సింగ్ 65 పరుగులతో అమన్ రావ్(Aman Rao) తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తొలి వికెట్ కు వీరిద్దరు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 15 ఓవర్లో చివరి బంతికి రాహుల్ సింగ్ రోహిత్ దాస్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఇక హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ 34 పరుగులు చేశాడు. బెంగాల్(Bengal ) బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. రోహిత్ దాస్, షహబాజ్ అహ్మద్ చెరో వికెట్ సాధించారు.


ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్‌ను నిలబెట్టిన ధీరుడు.. హ్యాపీ బర్త్‌డే పాజీ!

నా ఫొటోలను మార్ఫింగ్ చేయొద్దు: భారత స్టార్ మహిళా క్రికెటర్

Updated Date - Jan 06 , 2026 | 04:16 PM