షోయబ్ అక్తర్‌పై నెటిజన్ల ట్రోలింగ్ వర్షం.. ఎందుకంటే?
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:16 PM
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయబ్ అక్తర్ ఫుట్‌బాల్ విశ్లేషకుడి అవతారమెత్తి నెటిజన్ల చేతిలో దారుణంగా బుక్కయ్యాడు. నిన్న(ఆదివారం) జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ..
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయబ్ అక్తర్ ఫుట్‌బాల్ విశ్లేషకుడి అవతారమెత్తి నెటిజన్ల చేతిలో దారుణంగా బుక్కయ్యాడు. నిన్న(ఆదివారం) జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఓ పాకిస్థాన్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో అక్తర్ ప్యానెలిస్ట్‌గా పాల్గొన్నాడు. అయితే ఫుట్‌బాల్ ప్రపంచంలో 'GOAT' (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఎవరు అనే దానిపై అతడు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చి వివరణ విచిత్రంగా ఉంది. అంతేకాక ఫుట్‌బాల్ అభిమానులకు ఏమాత్రం రుచించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది.
ఈ షోలో అక్తర్ మాట్లాడుతూ.. 'ఫుట్‌బాల్ చరిత్రలోనే క్రిస్టియానో రొనాల్డో కంటే పెద్ద బ్రాండ్ మరొకటి లేదు. గత పదేళ్లుగా ఫిఫాతో పాటు పలు లీగ్‌లు రొనాల్డో పేరుతోనే వ్యాపారం చేశాయి. అయితే, మైదానంలో ఆట విషయానికొస్తే రొనాల్డో కంటే లియోనెల్ మెస్సీ చాలా ఎత్తులో ఉంటాడు. పిచ్‌పై మెస్సి కర్షణ శక్తి అద్భుతం. ఆయన కిందపడినా వెంటనే లేచి ఆటను కొనసాగిస్తాడు. రొనాల్డో గొప్పవాడే కావచ్చు, కానీ మెస్సి స్థాయి వేరు' అని వ్యాఖ్యానించాడు.
ఫుట్‌బాల్‌తో ఏమాత్రం సంబంధం లేని క్రికెటర్‌ను ప్రపంచకప్ ఫైనల్ వంటి కీలక మ్యాచ్ విశ్లేషణకు పిలవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక పదాలను తప్పుగా వాడటం, సరైన అవగాహన లేకుండా మాట్లాడటంపై ఫుట్‌బాల్ ప్రేమికులు అక్తర్‌ను మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. 'క్రికెట్ విశ్లేషణ వరకే పరిమితమైతే మంచిది'అని నెటిజన్లు ఆయనకు హితవు పలుకుతున్నారు. అసలు క్రికెట్ పై కూడా అవగాహన లేని వ్యక్తిని ఫుట్ బాల్ ప్రపంచ కప్ కు సంబంధించిన చర్చకు ఎవరు పిలిచారంటూ మరో నెటిజన్ ట్రోల్ చేశాడు. ఈ వీడియో చూసిన తర్వాత తమ ఇంగ్లీష్ టీచర్‌కు హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ మరో నెటిజన్లు కామెంట్ చేశాడు.
ఇవి కూడా చదవండి:
స్పెయిన్ స్టార్ ఫెరాన్.. ఫిఫా కంటే ముందే భారత్‌లో మెరిశాడు!
ఫిఫా ప్రపంచ కప్-2026 అవార్డ్స్: గోల్డెన్ బాల్ ఎవరికంటే?