Share News

వైభవ్ అరంగేట్రంపై చర్చ.. సంజునే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?: పుజారా

ABN , Publish Date - Jul 03 , 2026 | 02:47 PM

సంజును జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో వైభవ్‌ను ఓపెనింగ్‌కు దింపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా వైభవ్ అరంగేట్రం గురించి మాట్లాడాడు.

వైభవ్ అరంగేట్రంపై చర్చ.. సంజునే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?: పుజారా
Sanju Samson, Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపై చర్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ సిరీస్ ఓటమి తర్వాత వైభవ్‌ను ఆడించి ఉండాల్సిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. దీంతో సంజును జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో వైభవ్‌ను ఓపెనింగ్‌కు దింపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా వైభవ్ అరంగేట్రం గురించి మాట్లాడాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఓ స్పష్టమైన సూచన చేశాడు.


‘టీ20 ప్రపంచ కప్ 2026లో సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు అతడిపై టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉంది. సంజుకి ఉన్న టాలెంట్ ప్రకారం తుది జట్టులో ఆడాల్సిన ప్లేయరే. అతడిని డ్రాప్ చేయాలనే చర్చలో అర్థం లేదు. భారీ షాట్లకు వెళ్లకుండా సంజు సహజంగా ఆడితే సరిపోతుంది. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం తప్పు కాదు. అలా అని సంజునే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? టాప్ ప్లేయర్లను పక్కన పెట్టి కాకుండా సరైన విధానంలో ఆ ప్రక్రియ జరగాలి. సంజు, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి టాపార్డర్ ఆటగాళ్లను తొలగించకూడదు. వైభవ్ సూర్యవంశీకి కూడా అవకాశం వస్తుంది. అతడు ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు’ అని పుజారా వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఫిఫా వరల్డ్ కప్: స్పెయిన్ గోల్‌ కీపర్ గిన్నిస్ ప్రపంచ రికార్డు

ఫిఫా ప్రపంచ కప్: రిటైర్‌మెంట్ ప్రకటించనున్న రొనాల్డో?

Updated Date - Jul 03 , 2026 | 03:01 PM