Share News

ఐపీఎల్ 2026: సీఎస్కే దిగ్గజం ధోని రికార్డ్ బద్దలు కొట్టిన సంజు శాంసన్

ABN , Publish Date - Apr 26 , 2026 | 08:48 PM

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. అత్యంత వేగంగా 5000 వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు.

ఐపీఎల్ 2026: సీఎస్కే దిగ్గజం ధోని రికార్డ్ బద్దలు కొట్టిన సంజు శాంసన్
Sanju Samson

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ సీజన్‌లో రెండు సెంచరీలు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్.. జీటీతో మ్యాచ్‌లో నిరాశపర్చాడు. 15 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసి ఔటయ్యాడు. అయినప్పటికీ సంజు ఓ అరుదైన రికార్డును సాధించాడు. అత్యంత వేగంగా 5000 వేల పరుగులు మైలురాయిని అందుకున్న భారత బ్యాటర్ల జాబితాలో చేరాడు.


టోర్నీలో తక్కువ బంతుల్లో(3,555) ఐదు వేల రన్స్ చేసిన మూడో బ్యాటర్‌గా సంజు శాంసన్ నిలిచాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో రబాడా వేసిన రెండో ఓవర్ రెండో బంతికి సంజు ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. ధోని 3,691 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే అతడు కేఎల్ రాహుల్ (3,688 బంతులు), సురేశ్ రైనా(3,620 బంతులు)లను కూడా అధిగమించాడు. ఇక సంజు కంటే ముందు ఏబీ డివిలియర్స్(3,288 బంతులు), డేవిడ్ వార్నర్ (3,554 బంతులు) ఉన్నారు.


మ్యాచ్ విషయానికొస్తే..

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(74*) హాఫ్ సెంచరీ చేశాడు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాయి సుదర్శన్(87) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇదిలా ఉండగా, 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ నాలుగింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. మరోవైపు అన్నే మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే మూడింట్లో గెలిచి ఆరో స్థానంలో నిలిచింది.


ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

Updated Date - Apr 26 , 2026 | 08:49 PM