అలా అయితేనే ఆటలో కిక్.. రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:47 PM
తన రిటైర్‌మెంట్‌పై వస్తోన్న ఊహాగానాలకు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఘాటుగా బదులిచ్చాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: తన రిటైర్‌మెంట్‌పై వస్తోన్న ఊహాగానాలకు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఘాటుగా బదులిచ్చాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. మ్యాచ్ అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తన దృష్టంతా జట్టు విజయం పైనే ఉందని, బయట జరిగే ప్రచారాన్ని అస్సలు పట్టించుకోనని తేల్చి చెప్పాడు.
‘నా పని బ్యాట్‌తో పరుగులు చేయడం.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం. అరంగేట్రం చేసినప్పటి నుంచే నా బాధ్యత అదే. బయట ఎలాంటి ప్రచారం జరిగినా అది నన్ను ప్రభావితం చేయదు. నేను మైదానంలో జట్టుకు ఎలా ఉపయోగపడుతున్నానన్నదే నాకు ముఖ్యం. బయట ఇలాంటి హడావిడి ఉంటేనే ఆటలో కిక్ ఉంటుంది. ఇలాంటి ప్రచారాలకు, విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పే అవకాశం రావడం అదృష్టం. బయట వాళ్ల పని వాళ్లు చేస్తారు. నేను నా పని చేస్తాను. జట్టులో విజయంలో కీలక పాత్ర పోషించేందుకే ప్రతిక్షణం ఆలోచిస్తాను’ అని రోహిత్ శర్మ తనదైన శైలిలో రిటైర్‌మెంట్ వార్తలపై స్పందించాడు.
వన్డే ప్రపంచ కప్ లక్ష్యం!
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచ కప్ నాటికి రోహిత్‌కు దాదాపు 41 ఏళ్ల వయసు ఉంటుంది. అయినప్పటికీ గత రెండేళ్లలో 23 వన్డేలు ఆడిన రోహిత్.. 1,029 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అద్భుత ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా రోహిత్ శర్మ బలమైన సంకేతాలు ఇచ్చాడు. ఫిట్‌నెస్‌పైనా ప్రత్యేక దృష్టి పెట్టిన అతడు.. లార్డ్స్ ఇన్నింగ్స్‌లో క్రాంప్స్‌తో ఇబ్బంది పడినా చివరి వరకు పోరాడి తన పట్టుదలను మరోసారి చాటిచెప్పాడు. ప్రస్తుతం రిటైర్‌మెంట వార్తలకు తెరదించిన రోహిత్, సెప్టెంబర్-అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌లో మళ్లీ భారత జెర్సీలో కనిపించనున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్-2026 అవార్డ్స్: గోల్డెన్ బాల్ ఎవరికంటే?
ఫిఫా పోడియంపై ట్రంప్ హల్‌చల్.! చర్చనీయాంశమైన వీడియో