Share News

ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో చాలా నేర్చుకుంటాడు: రాబిన్ ఉతప్ప

ABN , Publish Date - Mar 14 , 2026 | 06:48 PM

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుత ప్రదర్శనలతో క్రికెట్ ప్రపంచాన్నే ఆకర్షిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. వైభవ్‌ బ్యాటింగ్‌పై స్పందించాడు.

ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో చాలా నేర్చుకుంటాడు: రాబిన్ ఉతప్ప
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుత ప్రదర్శనలతో క్రికెట్ ప్రపంచాన్నే ఆకర్షిస్తున్నాడు. 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇటీవల జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్‌లో 175 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. వైభవ్‌ బ్యాటింగ్‌పై స్పందించాడు.


‘గతేడాది నుంచి వైభవ్ ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ను నేను గమనిస్తున్నాను. అతడు అద్భుతమైన ప్లేయర్. కానీ వైభవ్ ప్రస్తుతం కొంత అదృష్టంపై ఆధారపడుతూ పరుగులు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది తాత్కాలికంగా బాగానే ఉండొచ్చు. అయితే ఈ సీజన్ అతడిని చాలా విషయాలు నేర్పుతుంది. అన్నిసార్లు అదృష్టం మీద ఆధారపడితే పరుగులు రావు’ అని ఉతప్ప వ్యాఖ్యానించాడు.


ఐపీఎల్‌ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్‌లోనే ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్‌గా బాది సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకే గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లో శతకం బాది ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్ 2025లో కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే 252 పరుగులు చేశాడు.


ఇవి కూడా చదవండి:

పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ

పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..

Updated Date - Mar 14 , 2026 | 07:01 PM