Share News

ఐపీఎల్ 2026: హాఫ్ సెంచరీతో చెలరేగిన రియాన్ పరాగ్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - May 01 , 2026 | 09:27 PM

జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. ఢిల్లీకి 226 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: హాఫ్ సెంచరీతో చెలరేగిన రియాన్ పరాగ్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
RR vs DC

ఇంటర్నెట్ డెస్క్: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. ఢిల్లీకి 226 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ రియాన్ పరాగ్(90) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఎట్టకేలకు ఈ సీజన్‌లో పరాగ్ తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. గాయం కారణంగా ఆటకు దూరమై.. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతోన్న ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో చెలరేగాడు.


ఓపెనర్లు యశస్వి జైస్వాల్(6), వైభవ్ సూర్యవంశీ(4) విఫలమైన వేళ.. రాజస్థాన్ 200 అయినా స్కోర్ చేయగలుగుతుందా? అని సందేహం వచ్చింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్(90; 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ధ్రువ్ జురెల్(42; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 59 బంతుల్లోనే 102 పరుగులు జోడించారు. రవీంద్ర జడేజా(20) పర్వాలేదనిపించాడు. శుభమ్ దూబె(6) నిరాశపర్చాడు. ఆఖరిలో వచ్చిన డొనొవాన్ ఫెరీరా(47*; 14బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) బీభత్సం సృష్టించాడు. భారీ షాట్లతో స్కోర్ బోర్డు వేగాన్ని పరుగులు పెట్టించాడు. కాగా ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 3, జెమీసన్, అక్షర్ పటేల్, నటరాజన్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ

అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్

Updated Date - May 01 , 2026 | 09:35 PM