థామస్ కప్ 2026: సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత పురుషుల జట్టు
ABN , Publish Date - May 01 , 2026 | 06:32 PM
ప్రతిష్ఠాత్మక థామస్ కప్ 2026 పోటీల్లో భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం క్వార్టర్ ఫైనల్‌లో పటిష్టమైన చైనీస్ తైపితో భారత్ తలపడింది. ఇందులో వరుసగా 3 సెట్లలో గెలిచి.. 3-0 తేడాతో ఘన విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: డెన్మార్క్ వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక థామస్ కప్ 2026 పోటీల్లో భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం క్వార్టర్ ఫైనల్‌లో పటిష్టమైన చైనీస్ తైపితో భారత్ తలపడింది. ఇందులో వరుసగా 3 సెట్లలో గెలిచి.. 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. రెండో సింగిల్స్‌లో భారత క్రీడాకారుడు ఆయుశ్ శెట్టి.. ప్రస్తుత ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ లిన్ చున్-యిపై 21-16, 21-17 తేడాతో గెలుపొందాడు. అంతకు ముందు జరిగిన సింగిల్స్‌లో లక్ష్య సేన్, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూడా గెలవడంతో భారత్ 3-0తో లీడ్‌లోకి వచ్చింది.
భారత్ ఈ టైలో పూర్తిగా ఆధిపత్యం చాటుతూ ప్రత్యర్థికి ఏ అవకాశమూ ఇవ్వకుండా విజయం సాధించింది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టైను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు సెమీఫైనల్లో భారత్.. క్వార్టర్ ఫైనల్ 2లో తలపడే ఫ్రాన్స్-జపాన్ మ్యాచ్ విజేతతో తలపడనుంది. ప్రస్తుత ఫామ్‌ను చూస్తే టైటిల్‌పై భారత ఆశలు మరింత బలంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్