Share News

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్

ABN , Publish Date - May 01 , 2026 | 07:16 PM

ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్
RR vs DC

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై భారీ స్కోర్‌ను ఛేజ్ చేసిన రాజస్థాన్.. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఆర్ఆర్ ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచిన ఢిల్లీ.. ఏడో స్థానంలో ఉంది. గాయం కారణంగా ఇప్పటి వరకు ఆటకు దూరమైన ఢిల్లీ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్.. ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.


రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు

రియాన్ పరాగ్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), డొనొవాన్ ఫెర్రీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబె, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నండ్రీ బర్గర్, బ్రిజేశ్ శర్మ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ఆడమ్ మిల్నే, డాసున్ శనక, రవి సింగ్, యశ్ రాజ్ పుంజా, తుషార్ దేశ్‌పాండే


ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు

అక్షర్ పటేల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిశాంక, నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, స్టబ్స్, అశుతోశ్ శర్మ, జెమీసన్, మిచెల్ స్టార్క్, కుల్‌దీప్ యాదవ్, టి నటరాజన్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, కరుణ్ నాయర్, అభిషేక్ పొరెల్, ఆకిబ్ నబీ దార్


ఇవి కూడా చదవండి:

శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ

అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్

Updated Date - May 01 , 2026 | 07:16 PM