Share News

రిషభ్ పంత్ గాయంపై టీమిండియా కోచ్ కీలక అప్‌డేట్

ABN , Publish Date - Aug 23 , 2026 | 08:03 PM

రిషభ్ పంత్ గాయం తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ అభిమానులకు ఊరటనిచ్చేలా కీలక అప్‌డేట్ ఇచ్చాడు.

రిషభ్ పంత్ గాయంపై టీమిండియా కోచ్ కీలక అప్‌డేట్
Rishabh Pant injury

ఇంటర్నెట్ డెస్క్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. మళ్లీ పంత్ బ్యాటింగ్‌కు దిగుతాడా? గాయం తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ అభిమానులకు ఊరటనిచ్చేలా కీలక అప్‌డేట్ ఇచ్చాడు. పంత్ రెండో రోజు బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధంగా ఉంటాడని స్పష్టం చేశాడు.


ఆదివారం మ్యాచ్ చివరి సెషన్‌లో పంత్ గాయపడ్డాడు. 58వ ఓవర్ తొలి బంతికే శ్రీలంక పేసర్ లాహిరు కుమార షార్ట్ బాల్ వేశాడు. ఆ బంతిని స్క్వేర్ లెగ్ దిశగా పుల్ చేసేందుకు ప్రయత్నించిన పంత్.. షాట్‌ను సరిగ్గా టైమింగ్ చేయలేకపోయాడు. బంతి అతడి ఎడమ మణికట్టును బలంగా తాకింది. దీంతో పంత్ తీవ్ర అసౌకర్యంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి ఐస్ ప్యాక్‌తో చికిత్స అందించాడు. పంత్ మణికట్టుకు టేపింగ్ కూడా చేశారు. అయితే నొప్పి తగ్గకపోవడంతో అంపైర్లతో చర్చించిన అనంతరం పంత్ మైదానం వీడాల్సి వచ్చింది. అప్పటికి అతడు 15 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం పంత్ గాయం తీవ్రతపై మరింత స్పష్టత రెండో రోజు వచ్చే అవకాశం ఉంది. అయితే కోచ్ కోటక్ తాజా ప్రకటన ప్రకారం.. అవసరమైతే పంత్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

శ్రీలంకతో రెండో టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే?

ఆసీస్‌పై ఘోర ఓటమి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక ఘనత

Updated Date - Aug 23 , 2026 | 08:03 PM