శ్రీలంకతో రెండో టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే?
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:45 PM
కొలంబో వేదికగా జరుగుతున్న శ్రీలంక-భారత్ మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కొలంబో వేదికగా జరుగుతున్న శ్రీలంక-భారత్ మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(117) సూపర్ సెంచరీ బాదాడు. వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(50) హాఫ్ సెంచరీ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో ధ్రువ్ జురెల్(7*), సారాంశ్ జైన్(4*) ఉన్నారు.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్(45), కేఎల్ రాహుల్(18) పరుగులు చేశారు. దేవదత్ పడిక్కల్, గిల్ కలిసి మూడో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్(3*) పరుగులు చేసి గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. తిరిగి మళ్లీ బరిలోకి దిగుతాడా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. రవీంద్ర జడేజా(43) కూడా క్రీజులో ఉన్నంత సేపు క్రాంప్స్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. పోరాడుతూనే ఆడి ఆఖరికి ఫెర్నాండో బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 3, లాహిరు కుమార, కేషారా నువాంత తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు కర్ణ్ శర్మ వీడ్కోలు
దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ.. ఎంత కొట్టాడంటే?