దులీప్ ట్రోఫీ: సుదీప్, షాబాజ్ సెంచరీలు.. విఫలమైన వైభవ్!
ABN , Publish Date - Aug 23 , 2026 | 06:30 PM
దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. సుదీప్ కుమార్(146), షాబాజ్ అహ్మద్(100*) సెంచరీలతో చెలరేగారు. కుమార్ కుషాగ్రా(55) హాఫ్ సెంచరీతో రాణించాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి షాబాజ్, అనుకుల్ రాయ్(22*) క్రీజులో ఉన్నారు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(8) నిరాశపరిచాడు. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(15), విరాట్ సింగ్(2), ఇషాన్ కిషన్(4) విఫలమయ్యారు. నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో జోటిన్ 3, ఆకాశ్ చౌదరి 2, బిష్వోర్జిత్ ఒక వికెట్ పడగొట్టారు.
చెలరేగిన బౌలర్లు..
వెస్ట్ జోన్, నార్త్ జోన్ మధ్య జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్‌లో తొలి రోజు బౌలర్లు చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ 251 పరుగులకు ఆలౌటైంది. అంశుల్ కాంబోజ్(60), ఆయుశ్ బదాని(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. వెస్ట్ జోన్ బౌలర్లలో తనుష్ కొటియన్ 4, తుషార్ దేశ్‌పాండే 4, ముకేశ్ చౌదరి, శార్దూల్ ఠాకూరల్ తలొక వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ జోన్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టపోయి 31 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(22), హర్విక్ దేశాయ్(3) పెవిలియన్ చేరారు. అర్ష్‌దీప్ సింగ్, అబిద్ ముస్తాక్ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో రెండో టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే?
ఆసీస్‌పై ఘోర ఓటమి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ చారిత్రాత్మక ఘనత