Share News

ఐపీఎల్ 2026: కేకేఆర్‌ను ఆదుకున్న రింకు సింగ్.. లఖ్‌నవూ లక్ష్యం ఎంతంటే?

ABN , Publish Date - Apr 26 , 2026 | 09:33 PM

ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఎల్ఎస్‌జీకి 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది

ఐపీఎల్ 2026: కేకేఆర్‌ను ఆదుకున్న రింకు సింగ్.. లఖ్‌నవూ లక్ష్యం ఎంతంటే?
KKR vs LSG

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఎల్ఎస్‌జీకి 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎట్టకేలకు రింకు సింగ్ నేడు కీలక నాక్ ఆడాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును హాఫ్ సెంచరీ చేసి ఆదుకున్నాడు. 51 బంతుల్లో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రింకు నాక్ వల్లే కేకేఆర్‌ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఆఖరి ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాది ఔరా అనిపించాడు.


26-3.jpgలఖ్‌నవూ బౌలర్ మొహ్సిన్ ఖాన్ ధాటికి కేకేఆర్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసి కోల్‌కతాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ సీజన్‌లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. కాగా కేకేఆర్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ(9) అబ్‌స్ట్రక్టింగ్ ఆఫ్ ది ఫీల్డ్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అత్యంత అరుదు. రనౌట్ కోసం ఫీల్డర్ బంతిని విసరగా అది రఘువంశీకి తగిలింది. సమీక్షలో ఫీల్డింగ్‌కు ఇబ్బంది కలిగించాడని థర్డ్ అంపైర్ ఈ నిర్ణయం ప్రకటించాడు. అజింక్య రహానె(10), టిమ్ సీఫర్ట్(0), కామెరూన్ గ్రీన్(34), పావెల్(1), అనుకుల్ రాయ్(0), రమన్‌దీప్ సింగ్(6) వరుసగా పెవిలియన్ చేరారు. రింకు సింగ్(83*), సునీల్ నరైన్(4*) నాటౌట్‌గా నిలిచారు. మొహ్సిన్ ఖాన్ 5, లిండే 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

Updated Date - Apr 26 , 2026 | 09:39 PM