Share News

ఐపీఎల్ 2026: రాజస్థాన్ టీమ్‌లోకి రవీంద్ర జడేజా రాయల్ ఎంట్రీ.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 10 , 2026 | 09:26 PM

క్రికెట్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ మెగా టోర్నీ అతి త్వరలో ప్రారంభం కానుంది. జడేజాకు రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ ఓ వీడియోను పంచుకుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఐపీఎల్ 2026: రాజస్థాన్ టీమ్‌లోకి రవీంద్ర జడేజా రాయల్ ఎంట్రీ.. వీడియో వైరల్
Ravindra Jadeja

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ఘనంగా ముగిసింది. ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ మెగా టోర్నీ అతి త్వరలో ప్రారంభం కానుంది. మార్చి 28 నుంచి ఈ మెగా టోర్నీకి తెరదిగనుందని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.


గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ట్రేడ్ ద్వారా సంజు శాంసన్‌ను సీఎస్కేకి ఇచ్చి జడేజాను ఆర్ఆర్ ఫ్రాంచైజీ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జడేజాకు రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ ఓ వీడియోను పంచుకుంది. 84 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో జడేజా సంప్రదాయ రాజస్థానీ వేషధారణలో కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇదిలా ఉండగా.. జడ్డూ తన ఐపీఎల్ కెరీర్‌ను 2008లో రాజస్థాన్ రాయల్స్ నుంచే ప్రారంభించాడు. ఆ తర్వాత సీఎస్కేతో 12 సీజన్లు, గుజరాత్ లయన్స్‌తో 2 సీజన్లు ఆడాడు. ఎట్టకేలకు తిరిగి తన హోం ఫ్రాంచైజీకే చేరడం విశేషం. 2008లో షేన్ వార్న్ నేతృత్వంలో రాయల్స్ టీమ్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు జడేజా కీలక సభ్యుడు. రెండు సీజన్ల పాటు రాయల్స్ ప్రాతినిధ్యం వహించిన జడ్డూ.. 22 ఇన్నింగ్స్‌ల్లో 430 పరుగులు చేసి 6 వికెట్లు తీశాడు.


ఇవి కూడా చదవండి:

చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!

డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ

Updated Date - Mar 10 , 2026 | 09:26 PM