బుమ్రాకు నేనే ట్రైనింగ్ ఇచ్చాను..పాక్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 08:03 PM
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్‌లో జన్మించి, యూఏఈ తరఫున ఆడిన జహూర్ ఖాన్ అనే పేస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు తానే కోచింగ్ ఇచ్చానంటూ గొప్పలకు పోయాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్ లో జన్మించి, వేరే దేశం తరఫు ఆడుతున్న ఓ బౌలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు తానే కోచింగ్ ఇచ్చానంటూ గొప్పలు చెప్పుకున్నాడు. స్లో డెలివరీ వేరియేషన్‌ను బుమ్రా తన వద్దనే నేర్చుకున్నాడని అన్నాడు. మరి.. బుమ్రాకే కోచింగ్ ఇచ్చిన ఆ పాకిస్థాన్ ఘనుడు ఎవరో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
జహూర్ ఖాన్ అనే వ్యక్తి పాకిస్థాన్‌లో జన్మించాడు. అనంతరం యూఏఈ వెళ్లి.. కొంతకాలం తర్వాత ఆ దేశ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. యూఏఈ తరఫున పేస్ బౌలర్‌గా జహూర్ ఎంపికయ్యాడు. ఈ వ్యక్తి.. యూఏఈ వెళ్లినా.. పాకిస్థాన్ బుద్ధులను మర్చిపోలేదు. అందుకే బుమ్రా విషయంలో గొప్పలు చెప్పుకున్నాడు. అతడు ఇంకా మాట్లాడుతూ...'2019లో నేను ఓ టీ10 లీగ్‌లో లెండిల్ సిమ్మన్స్‌కు ఐదు స్లో డెలివరీలతో మెయిడిన్ ఓవర్ వేశాను. ఆ వీడియో చూసిన బుమ్రా.. ఇవి ఎలా వేసావు.. హ్యాండ్ గ్రిప్ ఎలా ఉంటుందని నన్ను టిప్స్ అడిగాడు. తర్వాత ముంబై ఇండియన్స్ కోచింగ్ క్యాంప్‌లో బుమ్రాకు నేను అలాంటి బంతులే వేసి చూపించాను' అంటూ లేని గొప్పలు ఓ రేంజ్ లో చెప్పుకున్నాడు.
జహూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. జహూర్‌కు అంత సీన్ లేదని భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఆ టిప్స్ ఏవో పాకిస్థాన్ జట్టుకు ఇచ్చి ఉంటే బాగుండేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బుమ్రా నిరంతర అభ్యాసంతో ప్రపంచంలో అత్యుత్తమ పేసర్‌గా ఎదిగాడని ప్రశంసిస్తున్నారు. వాస్తవానికి స్లో బాల్ అనేది బుమ్రా అమ్ములపోదిలో ఓ అస్త్రం. తాజాగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లోనూ బుమ్రా ఇలాంటి బంతులను చాలాసార్లు ప్రయోగించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లోనూ యార్కర్లతో పాటు ఈ స్లో డెలివరీలను ప్రయోగించాడు. ఈ టోర్నీలో బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 12.43 సగటున, 6.21 ఎకానమీతో 14 వికెట్లు తీసి భారత్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!
డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ