Share News

చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!

ABN , Publish Date - Mar 10 , 2026 | 06:04 PM

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో మార్చి 14న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి రిసార్ట్‌లో కుల్‌దీప్ వివాహం జరగనుంది.

చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!
Kuldeep Yadav

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. టీ20 ప్రపంచ కప్ దృష్ట్యా తన వివాహాన్ని కుల్‌దీప్ వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. టోర్నీ ముగియడంతో పెళ్లి మాట మళ్లీ తెరపైకి వచ్చింది. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో మార్చి 14న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి రిసార్ట్‌లో కుల్‌దీప్ వివాహం జరగనుంది. మార్చి 17న లఖ్‌నవూలో రిసెప్షన్ జరగనుంది.


కుల్‌దీప్ యాదవ్, వన్షికలకు గతేడాది జూన్ 4న నిశ్చితార్థం జరిగింది. ఆమె తండ్రి ఎల్ఐసీ ఉద్యోగి. నిజానికి ఈ వివాహం గతేడాది నవంబర్‌లోనే జరగాల్సి ఉంది. కానీ టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో వాయిదా పడింది. కుల్‌దీప్ తండ్రి రామ్‌సింగ్ యాదవ్ మార్చి 8న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను వ్యక్తిగతంగా కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు.


అలా మొదలైంది..

కుల్‌దీప్ యాదవ్, వన్షిక ఇద్దరూ కాన్పూర్‌కు చెందినవారే. ఇద్దరి ఇళ్లు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో చిన్ననాటి నుంచే స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అత్యంత త్వరలోనే పెళ్లి పీటలెక్కుతుంది. అయితే ఈ పెళ్లి వేడుకకు బీసీసీఐ అధికారులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హాజరయ్యే అవకాశం ఉంది. కుల్దీప్ దీర్ఘకాల కోచ్ కపిల్ దేవ్ పాండే తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 13న హల్దీ, మెహందీ కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమవుతాయి.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ముగిశాకే వన్డే ప్రపంచ కప్ సన్నాహాలు: గౌతమ్ గంభీర్

పశ్చిమాసియాలో యుద్ధం.. శ్రీలంక-అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లు రద్దు

Updated Date - Mar 10 , 2026 | 06:04 PM