Share News

ఓ భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది.. మోదీపై రవిశాస్త్రి ప్రశంసలు

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:42 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీపై టీమిండియా మాజీ ప్లేయర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో మోదీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఓ భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది.. మోదీపై రవిశాస్త్రి ప్రశంసలు
Ravi Shastri

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీపై టీమిండియా మాజీ ప్లేయర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో మోదీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు జెన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి మోదీ మొక్క నాటుతున్న ఫొటోను రవిశాస్త్రి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా ఓ భారతీయుడిగా తనకు ఎంతో గర్వంగా ఉందంటూ పేర్కొన్నాడు.


‘ఓ భారతీయుడిగా ఇంతకంటే గర్వకారణం ఏముంటుంది. జిన్‌పింగ్, పుతిన్, మన ప్రధాని నరేంద్ర మోదీ‌లను.. ఇక్కడ మన మాతృదేశంలో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అపూర్వమైన అంతర్జాతీయ దౌత్యం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. టేక్ ఏ బౌ.. మోదీజీ’ అంటూ రవిశాస్త్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన రాహుల్ ద్రవిడ్!

భారత క్రికెట్ మహిళా ప్లేయర్ సంచలన నిర్ణయం

Updated Date - Sep 13 , 2026 | 03:42 PM