జపాన్ ఓపెన్ ఫైనల్: విజయ రహస్యాన్ని రివీల్ చేసిన పీవీ సింధు
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:15 PM
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్ చేరిన తర్వాత తొలిసారిగా స్పందించింది. తన విజయం వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్ చేరిన తర్వాత తొలిసారిగా స్పందించింది. తన విజయం వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించింది. ప్రపంచ స్థాయి ప్లేయర్లతో తలపడేటప్పుడు ప్రతి పాయింట్ కీలకమని.. అదే ఆలోచనతో బరిలోకి దిగానని తెలిపింది. సెమీ ఫైనల్‌లో చైనాకు చెందిన చెన్ యూఫీపై గెలుపొందిన సింధు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం సింధు మాట్లాడింది.
‘జపాన్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రతి మ్యాచ్ ఎంతో ముఖ్యమైనదే. ముఖ్యంగా నేటి మ్యాచ్‌లో ఆరంభం నుంచే పూర్తి ఏకాగ్రతతో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ఆటగాళ్లతో ఆడేటప్పుడు ప్రతి పాయింట్ విలువైనదే. అందుకే తొలి గేమ్ గెలవడం చాలా కీలకంగా మారింది’ అని సింధు వెల్లడించింది.
కోచ్ మాటలే ధైర్యాన్నిచ్చాయి..
తొలి గేమ్‌లో మంచి ఆధిక్యం సాధించిన తర్వాత యూఫీ పుంజుకుని స్కోరును 19-19తో సమం చేసింది. దీంతో తనపై ఒత్తిడి పెరిగిందని సింధు తెలిపింది. ‘నేను ఆధిక్యంలో ఉన్నప్పుడు చెన్ యూఫీ స్కోరును సమం చేసింది. అలాంటి సమయంలో కొన్ని పాయింట్లు కోల్పోతే మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. 'ఇంత మంచి ఆధిక్యం ఎలా కోల్పోయా' అనే భావన కలుగుతుంది. కానీ నా కోచ్ మాత్రం 'అది మర్చిపో.. తర్వాతి పాయింట్‌పైనే దృష్టి పెట్టు' అని పదే పదే చెప్పారు. అదే నాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది’ అని వివరించింది.
ఇవి కూడా చదవండి:
మెస్సి, రొనాల్డోలపై ప్రశంసలు.. ఇంగ్లండ్‌పై విమర్శలు చేసిన ట్రంప్
ఫిఫా.. థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడాలనే ఆసక్తి ఎవరికీ లేదు: ఫ్రాన్స్ కోచ్