అథ్లెట్ల కమిషన్ చైర్మన్‌గా సింధు
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:24 AM
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్ల కమిషన్‌లో కీలక పదవి దక్కింది. అథ్లెట్ల కమిషన్‌కు చైర్మన్‌గా సింధు ఎన్నికైంది.
హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘వైస్’ బాధ్యతలు
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్ల కమిషన్‌లో కీలక పదవి దక్కింది. అథ్లెట్ల కమిషన్‌కు చైర్మన్‌గా సింధు ఎన్నికైంది. ఈ కమిషన్ వైస్ చైర్మన్‌గా పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఎంపికయ్యాడు.
ఐఓఏ సర్వసభ్య సమావేశంలో అథ్లెట్ల ప్రతినిధులుగా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, స్విమ్మర్ సాజన్ ప్రకాశ్ ఎన్నికయ్యారు. పై నలుగురికి వ్యతిరేకంగా మరెవరూ పోటీలో లేకపోవడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి సంజయ్ శ్రీవాస్తవ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. వీరు నాలుగేళ్లపాటు పదవుల్లో కొనసాగనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రత్యేక ప్రదర్శనకు దాదా ‘లార్డ్స్’ జెర్సీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News