Share News

పీవీ సింధు రికార్డు.. హైలో ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం!

ABN , Publish Date - Nov 01 , 2026 | 07:49 PM

భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మరోసారి చరిత్ర సృష్టించింది. జర్మనీ వేదికగా ముగిసిన ప్రతిష్ఠాత్మక హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది.

పీవీ సింధు రికార్డు.. హైలో ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం!
PV Sindhu

స్పోర్ట్స్ డెస్క్: భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మరోసారి చరిత్ర సృష్టించింది. జర్మనీ వేదికగా ముగిసిన ప్రతిష్ఠాత్మక హైలో ఓపెన్ (Hylo Open) బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచి సరికొత్త మైలురాయిని చేరుకుంది.


ఇవాళ(ఆదివారం) జరిగిన హైలో ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌ తుదిపోరులో పీవీ సింధు డెన్మార్క్‌కు చెందిన లైన్ జార్స్‌ఫెల్డ్‌ను 21-12, 21-14 తేడాతో చిత్తుగా ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీ చరిత్రలో పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత ఆటగాళ్లు గతంలో టైటిల్స్ సాధించినప్పటికీ.. మహిళల సింగిల్స్ ట్రోఫీని గెలుచుకోవడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్‌గా సింధు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్ పోరులో సింధు తనదైన దూకుడును ప్రదర్శించింది.


అద్భుతమైన స్మాష్‌లతో ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా సింధు విజయం సాధించింది. గత కొంతకాలంగా ఫామ్ కోసం శ్రమిస్తున్న ఈ తెలుగు తేజం, ఈ విజయంతో మళ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. సింధు సాధించిన ఈ చరిత్రాత్మక విజయంపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. దేశానికి మరోసారి వన్నె తెచ్చిన సింధు భవిష్యత్తు టోర్నీల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇవీ చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ

ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..

5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్

Updated Date - Nov 01 , 2026 | 08:02 PM