Share News

బాబర్ ఆజమ్ మానసిక స్థితి సరిగ్గా లేదు: పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 09:51 AM

పాకిస్థాన్ సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ.. బాబర్ ఫామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బాబర్ ఆజమ్ మానసిక స్థితి సరిగ్గా లేదు: పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Babar Azam

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలోనూ తీవ్రంగా విఫలమయ్యాడు. అయితే ఆ మెగా టోర్నీ సమయంలో బాబర్, ఫఖర్ జమాన్ ఇద్దరూ గాయాలపాలయ్యారని పాక్ సెలెక్టర్ అకిబ్ జావెద్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ.. బాబర్ ఫామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే టీమ్ సెలెక్షన్ విషయంలో కోచ్ మైక్ హెస్సేన్‌కు ప్రత్యేక అధికారాలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కట్టబెట్టడాన్నీ బాసిత్ అలీ తప్పుబట్టాడు.


‘బాబర్ ఆజమ్ క్రికెట్ ఆడేందుకు మానసిక స్థితి సరిగ్గా లేదు. అతడు శారీరకంగా ఇబ్బంది పడుతున్న సూచనలు అయితే నాకేమీ కనిపించడం లేదు. బాబర్ నాలుగో స్థానంలో సరిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. బాబర్ మెంటల్లీ అన్‌ఫిట్. ఫిజికల్లీ కాదు. జట్టును ఎంపిక చేయడానికి అతడు (కోచ్) ఎవరు? అది ఏమైనా అతడి అంకుల్స్ జట్టా?’ అని బాసిత్ అలీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.


ఇదిలా ఉండగా.. ప్రపంచ కప్ టోర్నీ నుంచి పాక్ బ్యాటర్ల ఫామ్ లేమి కొనసాగుతూ వస్తోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కోల్పోయింది. మూడో వన్డేలో పాక్‌పై బంగ్లా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీనియర్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా(106) సెంచరీతో రాణించినా పాక్‌కు పరాభవం తప్పలేదు.


ఇవి కూడా చదవండి:

ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం నాపై పడకుండా చేశారు: అభిషేక్ శర్మ

భవిష్యత్తులో టీమిండియా మరిన్ని కప్పులు గెలుస్తుంది: సంజు శాంసన్

Updated Date - Mar 16 , 2026 | 09:51 AM