Share News

మాకేం తెలియదు.. ఇంగ్లండ్ టూర్ బహిష్కరణ వార్తలపై పాక్ హెడ్ కోచ్ క్లారిటీ

ABN , Publish Date - Aug 29 , 2026 | 08:21 PM

ఇంగ్లండ్‌ పర్యటనను బహిష్కరిస్తామని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) బెదిరించినట్లు వచ్చిన వార్తలపై పాకిస్థాన్‌ హెడ్‌ కోచ్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పందించాడు.

మాకేం తెలియదు.. ఇంగ్లండ్ టూర్ బహిష్కరణ వార్తలపై పాక్ హెడ్ కోచ్ క్లారిటీ
Sarfaraz Ahmed

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌ పర్యటనను బహిష్కరిస్తామని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) బెదిరించినట్లు వచ్చిన వార్తలపై పాకిస్థాన్‌ హెడ్‌ కోచ్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పందించాడు. పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌ కుమారులు ఖాసిమ్‌, సులేమాన్‌ ఖాన్‌లు స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రసారం చేయడంపై పీసీబీ, ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మధ్య వివాదం తలెత్తిన విషయం తమకు తెలియదని సర్ఫరాజ్‌ స్పష్టం చేశాడు.


‘మాకు ఏమీ తెలియదు. నా దృష్టంతా మ్యాచ్‌పైనే ఉంది. మీరు అడుగుతున్న ఆ ఇంటర్వ్యూ గురించే మాకు తెలియదు. ఆ సమయంలో మేమందరం లంచ్ చేస్తున్నాం. ఇంగ్లండ్ పర్యటనను బహిష్కరిస్తామన్న వార్తల్లో నిజం లేదు’ అని సర్ఫరాజ్‌ తెలిపాడు.


అసలు ఏం జరిగిందంటే?

తొలి రోజు లంచ్‌ బ్రేక్ సమయంలో స్కై స్పోర్ట్స్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కుమారులు ఖాసిమ్‌, సులేమాన్‌లతో చేసిన ముందుగా రికార్డు చేసిన ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. జైలులో ఉన్న తమ తండ్రి ఆరోగ్యం, వైద్యం, భద్రతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పీసీబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇంటర్వ్యూ ప్రసారం చేస్తే లార్డ్స్‌ టెస్టును రద్దు చేయడంతో పాటు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ మొత్తాన్ని పాకిస్థాన్‌ మధ్యలోనే వదిలేసే అవకాశం ఉందని పీసీబీ హెచ్చరించినట్లు సమాచారం. స్కై స్పోర్ట్స్‌ నుంచి ఫిర్యాదు అందడంతో తొలుత ఇంటర్వ్యూను వాయిదా వేసినప్పటికీ.. చివరకు దానిని ప్రసారం చేసింది.


ఇవి కూడా చదవండి:

టీమిండియా మ్యాచ్‌లకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు.. కారణం ఇదేనా!

51 ఏళ్ల వయసులో ‘ఫైఫర్’.. 94 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మహిళా క్రికెటర్!

Updated Date - Aug 29 , 2026 | 08:21 PM