Share News

ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ.. భారత్‌లో ఆడబోం: పాకిస్థాన్

ABN , Publish Date - Sep 16 , 2026 | 09:18 PM

భారత్‌ వేదికగా అక్టోబర్ 27 నుంచి జరగనున్న మెన్స్ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీ విషయంలో పాకిస్థాన్‌ కొత్త పేచీ పెట్టింది. మ్యాచ్‌లను భారత్‌లో ఆడబోమని, టోర్నీ నిర్వహణను మరో దేశానికి మార్చాలని ఆసియా హాకీ సమాఖ్యను కోరింది.

ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ.. భారత్‌లో ఆడబోం: పాకిస్థాన్
Asia Champions Trophy Hockey 2026

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ వేదికగా అక్టోబర్ 27 నుంచి జరగనున్న మెన్స్ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీ విషయంలో పాకిస్థాన్‌ కొత్త పేచీ పెట్టింది. మ్యాచ్‌లను భారత్‌లో ఆడబోమని, టోర్నీ నిర్వహణను మరో దేశానికి మార్చాలని.. లేదంటే తటస్థ వేదికలో నిర్వహించాలని ఆసియా హాకీ సమాఖ్య (AHF)ను పాకిస్థాన్‌ హాకీ సమాఖ్య కోరింది. పాకిస్థాన్‌ హాకీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మొహియుద్దీన్‌ అహ్మద్‌ వానీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.


భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్‌ హాకీ ఫెడరేషన్‌ తెలిపింది. అయితే ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే విషయంలో పాకిస్థాన్‌ వెనక్కి తగ్గడం లేదని ఫెడరేషన్‌ స్పష్టం చేసింది. భారత్‌ సహా అన్ని దేశాలతో ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.


ముందు భారత్‌కు వస్తామని..

ఆసక్తికరంగా.. పాకిస్థాన్‌ తాజాగా ఈ అభ్యర్థన చేయడానికి రెండు రోజుల ముందే ఆ జట్టు భారత్‌లో జరిగే టోర్నీలో పాల్గొంటుందని ప్రకటించారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సెప్టెంబర్‌ 14న పాకిస్థాన్‌ టోర్నీలో ఆడుతుందని వెల్లడించారు. భారత్‌-పాకిస్థాన్‌ ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశం లేకపోయినా.. బహుళజాతి టోర్నీల్లో ఇరు జట్లు తలపడేందుకు భారత విధానం అనుమతిస్తుందని ఆయన తెలిపారు. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, పాకిస్థాన్‌, చైనా, జపాన్‌, మలేసియా, దక్షిణ కొరియా జట్లు పాల్గొననున్నాయి. పాకిస్థాన్‌ వైదొలిగితే ప్రత్యామ్నాయంగా ఒమన్‌, బంగ్లాదేశ్‌లను రిజర్వ్‌ జట్లుగా ఉంచారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2027: భారత్‌లోనే మినీ వేలం.. వారణాసిలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు!

యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రాకెట్ బద్దలు.. సబలెంకాకు భారీ జరిమానా

Updated Date - Sep 16 , 2026 | 09:56 PM