ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:15 PM
ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌లో 2-0తేడాతో తుర్కియేపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత సంతతికి చెందిన నిషాన్ వెలుపిళ్లై అనే ప్లేయర్‌పైనే అందరి దృష్టి నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌లో 2-0తేడాతో తుర్కియేపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత సంతతికి చెందిన నిషాన్ వెలుపిళ్లై అనే ప్లేయర్‌పైనే అందరి దృష్టి నిలిచింది. ఫిఫా ప్రపంచ కప్ ఆడిన తొలి భారత సంతతి ఆటగాడిగా నిషాన్ చరిత్ర సృష్టించాడు. నేడు తుర్కియేపై జరిగిన మ్యాచ్‌లో 61వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు.
ఎవరీ నిషాన్ వెలుపిళ్లై?
నిషాన్ తల్లి గిలియన్ వెలుపిళ్లై ఆంగ్లో-ఇండియన్. 25 ఏళ్ల నిషాన్ 2024లో ఆస్ట్రేలియా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. చైనాతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యామ్నాయ ఆటగాడిగా వచ్చిన అతడు.. కేవలం ఏడు నిమిషాల్లోనే గోల్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పటి నుంచి నిషాన్ ఎనిమిది అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మూడో గోల్స్ నమోదు చేశాడు. అతడి ప్రతిభను గుర్తించిన ఆస్ట్రేలియా కోచ్ టోనీ పోపోవిక్ ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 24 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన తుర్కియే జట్టుకు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. తొలి అర్ధభాగంలో నెస్టోరీ ఇరాన్‌కుండ అద్భుత గోల్‌తో జట్టుకు ఆధిక్యం అందించాడు. అనంతరం 75వ నిమిషంలో కాన్నోర్ మరో గోల్ సాధించడంతో ఆస్ట్రేలియా విజయాన్ని ఖరారు చేసింది.ఈ విజయంతో ఆస్ట్రేలియా నాకౌట్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోగా, ప్రపంచకప్ వేదికపై భారత సంతతి ఆటగాడి అరంగేట్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మ రనౌట్‌పై స్పందించిన శుభ్‌మన్ గిల్
అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్ మీట్‌ను మధ్యలో ఆపేసిన నితీశ్‌కుమార్ రెడ్డి