భారత్‌తో టెస్టు: మూడో రోజు ముగిసిన ఆట.. కివీస్ స్కోర్ 133/3
ABN , Publish Date - Nov 29 , 2026 | 11:08 AM
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట నిలిచే సమయానికి కివీస్ 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట నిలిచే సమయానికి కివీస్ 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. క్రీజులో డారిల్ మిచెల్(5*), రచిన్ రవీంద్ర(46*) ఉన్నారు. ఓపెనర్ టామ్ లాథమ్(8), నికోల్స్(22) విఫలమవగా.. డేవాన్ కాన్వే(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా భారత్‌పై కివీస్ 243 పరుగుల ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.
అంతకుముందు 116/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మరో 130 పరుగులు జోడించి 246 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్ జురెల్(88) హాఫ్ సెంచరీతో రాణించి.. భారత్‌కు ఫాలో ఆన్ గండాన్ని తప్పించాడు. కివీస్ బౌలర్లలో జెమీసన్ 4 వికెట్లు తీశాడు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌తో టెస్టు: జురెల్ సెంచరీ మిస్.. 246 పరుగులకే భారత్ ఆలౌట్
మైదానంలోనే క్లాస్ తీసుకున్నాడు.. అప్పుడు ధోనీని చూసి భయపడ్డా: కుల్దీప్ యాదవ్