Share News

విమర్శలకు ఎలా సమాధానం ఇవ్వాలో గంభీర్‌కు బాగా తెలుసు: మురళీ కార్తిక్

ABN , Publish Date - Nov 11 , 2026 | 08:18 PM

టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ స్పందించాడు.

విమర్శలకు ఎలా సమాధానం ఇవ్వాలో గంభీర్‌కు బాగా తెలుసు: మురళీ కార్తిక్
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. జట్టు ఎంపిక, ఆటగాళ్లకు ఇచ్చే అవకాశాలు, వ్యూహాలు, కోచింగ్ విధానంపై తరచూ చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ స్పందించాడు. గంభీర్‌కు విమర్శలను తట్టుకునే సత్తా ఉందని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల వ్యాఖ్యలను పక్కన పెట్టడం అతడికి తెలుసని అభిప్రాయపడ్డాడు.


‘కోచ్‌గా బాధ్యతలను స్వీకరించినప్పుడు ఇలాంటి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు చాలా గట్టి మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. ఎలాంటి విమర్శలు ప్రభావితం చేయకుండా ఉండే స్థాయికి మనం ఎదగాలి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. దురదృష్టవశాత్తూ మనం ఎదుర్కోవాల్సిన వాస్తవం ఇదే. గంభీర్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ అతడు అవన్నీ పెద్దగా పట్టించుకోడు. విమర్శలకు ఎలా సమాధానం ఇవ్వాలో గంభీర్‌కు బాగా తెలుసు. అతడిది గట్టి మనస్తత్వం. తనపై వచ్చే విమర్శల నుంచి గంభీర్ దూరంగా ఉండాలి. తన ఉద్దేశాలు, చేస్తున్న పని సరైనదేనా అనే విషయాలపై దృష్టి పెట్టాలి. కోచ్‌గా మీ ఆలోచనలు, లక్ష్యాల విషయంలో నిజాయతీగా ఉండాలి. చివరికి అదే ముఖ్యం’ అని గంభీర్‌కు మురళీ కార్తీక్ సూచించాడు.


ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!

కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?

Updated Date - Nov 11 , 2026 | 08:18 PM