Malaysia Open 2026: సెమీస్‌కు పీవీ సింధు.. గాయంతో వైదొలిగిన యమగుచి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:16 PM
మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఆమె ప్రత్యర్థి జపాన్‌కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగుచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో.. సింధు తన తొలి ఆటను 21-11 తేడాతో గెలుచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: కౌలాలంపుర్ వేదికగా మలేషియా ఓపెన్ 2026 టోర్నీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఆమె ప్రత్యర్థి జపాన్‌కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగుచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో.. సింధు తన తొలి ఆటను 21-11 తేడాతో గెలుచుకుంది. అయితే మోకాలి గాయం కారణంగా యమగుచి ఆట నుంచి వైదొలగడంతో పీవీ సింధు(PV Sindhu) సునాయసంగా సెమీస్‌లోకి అడుగు పెట్టింది.
ఈ విజయంతో ప్రపంచ మూడో ర్యాంక్‌లో ఉన్న యమగుచి(Akane Yamaguchi)పై 18వ ర్యాంక్‌లో ఉన్న సింధు హెడ్ టు హెడ్ రికార్డ్ 15-12కు చేరుకొంది. గాయం తర్వాత సింధు తొలిసారిగా ఈ టోర్నమెంట్‌లో పోటీ పడుతోంది. మరో క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన రెండో సీడ్ వాంగ్ జియి, ఇండోనేషియా ఆరో సీడ్ పుత్రి కుసుమా వార్దాని పోటీ పడుతున్నారు. వీరిలో విజేతగా నిలిచిన వారితో సింధు సెమీస్‌లో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టెస్టులకు 15 రోజుల ప్రిపరేషన్ విండో.. గిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు!