Vaibhav Suryavanshi: ఏంటి తమ్ముడు.. ఈ విధ్వంసం సరిపోతుందా?.. వైభవ్ బ్యాటింగ్‌పై అశ్విన్ ప్రశంసలు!
ABN , Publish Date - Jan 09 , 2026 | 09:20 AM
అండర్ 19 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియా యువ ఆటగాళ్లు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తలపడుతున్నారు. ఇందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. 14 ఏళ్ల వయసులోనే ఈ విధ్వంసం ఏంటని ఆశ్చర్యపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియా యువ ఆటగాళ్లు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తలపడుతున్నారు. ఇందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడు మ్యాచుల్లో ఒక హాఫ్ సెంచరీ, భారీ సెంచరీ సాధించాడు. ముఖ్యంగా మూడో యూత్ వన్డేలో కేవలం 63 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌కి ఫిదా అయిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin).. వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. 14 ఏళ్ల వయసులోనే ఈ విధ్వంసం ఏంటని ఆశ్చర్యపోయాడు.
‘171(95), 50(26), 190(84), 68(24), 108*(61), 46(25), 127(74).. గత 30 రోజుల్లో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) దేశవాళీ, అండర్ 19 క్రికెట్‌లో సాధించిన స్కోర్లలో ఇవి కొన్ని మాత్రమే. ఏంటి తమ్ముడు? ఈ శాంపిల్ సరిపోతుందా? లేదా మరింత డోస్ పెంచబోతున్నావా? ఈ చిచ్చర పిడుగు 14 ఏళ్ల వయసులోనే సృష్టిస్తున్న విధ్వంసాన్ని మాటల్లో వర్ణించలేం. రానున్న అండర్ 19 ప్రపంచ కప్‌లో అతడు అందరి దృష్టిని ఆకర్షించనున్నాడు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తూ ఓపెనర్‌గా తొలి సీజన్ ఆడునున్నాడు. వచ్చే నాలుగు నెలలపాటు అతడి ఆటను చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను’ అని అశ్విన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.
గతేడాది ఐపీఎల్‌లో క్రికెట్ అరంగేట్రం చేసిన వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై సంచలన బ్యాటింగ్‌తో 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 2026 కోసం ఈ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతనిపై నమ్మకంతోనే సంజూ శాంసన్‌ను సీఎస్కేకి వదిలేసిందనడంలో సందేహమే లేదు.
ఇవి కూడా చదవండి:
గాయంతో తిలక్ వర్మ దూరం.. రేసులో ఉన్నదెవరంటే?
ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది: బెన్ స్టోక్స్