కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం
ABN , Publish Date - Jul 22 , 2026 | 07:33 PM
భారత తుది జట్టులో చోటు దక్కకపోవడంతో స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ కౌంటీ క్లబ్ యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత తుది జట్టులో చోటు దక్కకపోవడంతో స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ కౌంటీ క్లబ్ యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో యార్క్‌షైర్ తరఫున బరిలోకి దిగనున్నాడు. యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కుల్‌దీప్ యాదవ్ ఐదు మెట్రో బ్యాంక్ వన్డే కప్ మ్యాచ్‌లతో పాటు సెప్టెంబర్‌లో జరిగే కౌంటీ ఛాంపియన్‌షిప్ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. శుక్రవారం గ్లామోర్గన్‌తో జరిగే వన్డే మ్యాచ్‌కు కూడా అతడు జట్టులో చేరనున్నాడు.
సంతోషంగా ఉంది: కుల్దీప్
ఈ సందర్భంగా కుల్‌దీప్ యాదవ్ మాట్లాడాడు. ‘యార్క్‌షైర్ వంటి గొప్ప చరిత్ర కలిగిన క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంగ్లండ్ వంటి పరిస్థితుల్లో ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టం. జట్టు యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఆడాలనే ఆసక్తి మరింత పెరిగింది. నా వంతు పాత్రను సమర్థంగా పోషిస్తానని ఆశిస్తున్నాను’ అని తెలిపాడు. కుల్‌దీప్ యాదవ్ ఇప్పటివరకు 18 టెస్టుల్లో 79 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో మరింత ప్రభావం చూపిన కుల్దీప్.. 194 వికెట్లు సాధించాడు. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు అతడిని బెంచ్‌కే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. గురువారం నుంచి ప్రారంభం కానున్న జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు కూడా కుల్‌దీప్ యాదవ్‌ను ఎంపిక చేయలేదు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫెమా కేసులో ఊరట.. 16 ఏళ్ల తర్వాత భారత్‌కు లలిత్ మోదీ!
టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. సమన్వయ లోపమే కారణమా?