Share News

గిల్‌కు 70 పరుగుల వద్దే కండరాలు పట్టేస్తున్నాయి: స్టువర్ట్ బ్రాడ్

ABN , Publish Date - Jul 22 , 2026 | 06:51 PM

భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్‌పై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో గిల్ బ్యాటింగ్‌తో అదరగొట్టినప్పటికీ.. కీలక సమయంలో కండరాలు పట్టేయడంపై ప్రశ్నలు లేవనెత్తాడు.

గిల్‌కు 70 పరుగుల వద్దే కండరాలు పట్టేస్తున్నాయి: స్టువర్ట్ బ్రాడ్
Stuart Broad

ఇంటర్నెట్ డెస్క్: భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్‌పై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో గిల్ బ్యాటింగ్‌తో అదరగొట్టినప్పటికీ.. కీలక సమయంలో కండరాలు పట్టేయడంపై ప్రశ్నలు లేవనెత్తాడు. 70 పరుగుల చేసిన తర్వాతే గిల్‌కు క్రాంప్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత్ 1-2తో ఓడిపోయినప్పటికీ, గిల్ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే తొలి, మూడో వన్డేల్లో 70 పరుగుల మార్కు దాటిన తర్వాత అతడికి క్రాంప్స్ సమస్య ఎదురవ్వడం గమనార్హం.


‘ప్రతిసారి శుభ్‌మన్ గిల్ 70 పరుగుల మార్క్ దాటగానే క్రాంప్స్‌తో ఇబ్బంది పడుతున్నాడు. తొలి, మూడో వన్డేల్లో అతని రిథమ్ దెబ్బతింది. అయితే గిల్ వన్డే గణాంకాలు అద్భుతం. బర్మింగ్‌హామ్‌లో అతని రికార్డును తెరపై చూసినప్పుడు సగటు దాదాపు 60గా కనిపించింది. మొదట నమ్మలేక మరోసారి చూసుకోవాల్సి వచ్చింది. అది 10 మ్యాచ్‌ల్లో సాధించిన రికార్డు కాదు.. ఇన్ని మ్యాచ్‌ల తర్వాత కూడా అదే స్థాయిలో ప్రదర్శన కనబరచడం గొప్ప విషయం’ అని బ్రాడ్ ప్రశంసించాడు. 26 ఏళ్ల గిల్ ఇప్పటివరకు 67 వన్డేల్లో 3,379 పరుగులు చేశాడు.


నాకు ఆశ్చర్యంగా అనిపించింది: బట్లర్

గిల్‌తో పాటు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడే ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘తొలి వన్డేలో గిల్‌కు క్రాంప్స్ వచ్చాయని శ్రేయస్ అయ్యర్ నాకు చెప్పాడు. ఇంగ్లండ్ వాతావరణంలో ఇలా జరగడం ఆశ్చర్యంగా అనిపించింది. ఇది అహ్మదాబాద్‌లోని 40 డిగ్రీల వేడి కాదు. బహుశా ఏదైనా అంతర్గత గాయం ఉండొచ్చు. లార్డ్స్‌లో కీలక సమయంలో అతని వేగాన్ని తగ్గించి, వికెట్ కోల్పోయేలా చేసింది’ అని బట్లర్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫెమా కేసులో ఊరట.. 16 ఏళ్ల తర్వాత భారత్‌కు లలిత్ మోదీ!

టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. సమన్వయ లోపమే కారణమా?

Updated Date - Jul 22 , 2026 | 06:51 PM