ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా వైదొలిగిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్
ABN , Publish Date - Mar 14 , 2026 | 08:50 PM
ఐపీఎల్ 2026 సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మెంటార్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. డీసీ మెంటార్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సమరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మెంటార్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. డీసీ మెంటార్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడుతూ ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం కూడా వెల్లడించాడు. అయితే ఆ పోస్టును హిందీలో పెట్టడం గమనార్హం.
‘నేను ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గా ఉండటం లేదు. ఆ బాధ్యతలకు కావాల్సినంత సమయం కేటాయించలేకపోతున్నా. అయితే ఈ సీజన్‌లో ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఫ్యాన్స్‌ను మాత్రం కామెంట్రీ బాక్స్‌లో నుంచి చూస్తా. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ ఐపీఎల్. కానీ ఈసారి నేను కొత్త సీజన్ కోసం వేచి చూడలేకపోతున్నా’ అని పీటర్సన్ ఎక్స్‌లో పేర్కొన్నాడు.
కారణం ఇదేనా?
ఇంగ్లండ్ జట్టుకు కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని ఇటీవల కెవిస్ పీటర్సన్ ఆసక్తి చూపించాడు. బ్రెండన్ మెకెల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ సత్ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో కోచ్ మార్పు ఉండే అవకాశాలను ఉన్నాయి. దీంతో మెంటార్ వంటి బాధ్యతలు ఉంటే అవరోధంగా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకే పీటర్సన్ ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ పదవిని వదిలేశాడంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ
పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..