Share News

ఐపీఎల్ 2026: ఇంగ్లిస్ హాఫ్ సెంచరీ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - May 23 , 2026 | 09:25 PM

ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: ఇంగ్లిస్ హాఫ్ సెంచరీ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
LSG vs PBKS

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్‌కు 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్(72; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.


ఆయుశ్ బదోని(43; 18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. రిషబ్ పంత్(26), కులకర్ణి(0), ముకుల్ చౌదరి(1) విఫలమయ్యారు. అబ్దుల్ సమద్(37*), అర్జున్ టెండూల్కర్(5*) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో యాన్సెన్ , చాహల్ 2, శశాంక్ సింగ్, అజ్మతుల్లా తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

అభిమానికి సారీ చెప్పిన రోహిత్ శర్మ.. ఎందుకంటే?

Updated Date - May 23 , 2026 | 09:25 PM