Share News

సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 09:49 AM

టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డుపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కన్నేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు
Viv Richards

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డుపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కన్నేశాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌లో 14 వేలకుపైగా పరుగులు చేసిన రూట్.. సచిన్ రికార్డుకు చేరువవుతున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రూట్ సచిన్ రికార్డును బద్దలు కొట్టగలడని ధీమా వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు 307 ఇన్నింగ్స్‌ల్లో 14,208 పరుగులు చేసిన రూట్.. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 15,921 పరుగుల ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. రూట్ ఇదే స్థాయిలో ఆడితే సచిన్ రికార్డును అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ మ్యాచ్ స్పెషల్ కార్యక్రమంలో మాట్లాడిన రిచర్డ్స్.. రూట్‌తో పాటు ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జెఫ్రీ బాయ్‌కాట్‌ను ప్రస్తావిస్తూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు.


‘రూట్ ఇప్పుడు టెస్టు క్రికెట్ జట్టుకు కెప్టెన్. బ్యాటర్‌గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. సచిన్ రికార్డును అతడు ఎందుకు బద్దలు కొట్టకూడదు? రూట్ ఆ రికార్డును సాధించేందుకు ప్రయత్నించడంలో తప్పేమీ లేదు. అది అతడి కెరీర్‌లోనే గొప్ప మైలురాయి అవుతుంది. అంతేకాదు.. యార్క్‌షైర్ నుంచి వచ్చిన ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అత్యుత్తమ క్రికెట్ కానే కాదు. ఈ అరుదైన ఫీట్‌ను అందుకుంటే జో రూట్ బెస్ట్ క్రికెటర్ అవుతాడు. సచిన్ టెండూల్కర్ అత్యధిక టెస్టు పరుగుల రికార్డును రూట్ బ్రేక్ చేసి తీరుతాడు’ అని వివ్ రిచర్డ్స్ వెల్లడించాడు.


సచిన్ రికార్డుకు చేరువవుతాడు: రూట్ తండ్రి

రూట్.. సచిన్ రికార్డును బద్దలు కొడతాడా? అనే చర్చ కొనసాగుతున్న వేళ.. అతడి తండ్ మ్యాట్ రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్సీ వల్ల రూట్ బ్యాటింగ్ పెద్దగా ప్రభావితం కాదని మాట్ రూట్ పేర్కొన్నాడు. ‘అతడు చేయలేడని నేను అనుకోవడం లేదు. అతడు కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా ఒక ఏడాది 1,700 పరుగులు చేశాడు. కెప్టెన్సీ తన బ్యాటింగ్‌ను ప్రభావితం చేయదని అతడు ఇప్పటికే నిరూపించాడు. ఫిట్‌గా, ఏకాగ్రతతో ఉండి.. ఇంకా ఆడాలనే కోరిక ఉంటే సచిన్ రికార్డుకు సులువుగా చేరువ అవుతాడు’ అని వెల్లడించారు. సచిన్ రికార్డును అధిగమించాలంటే రూట్ ఇంకా 1,713 పరుగులు చేయాల్సి ఉంది. అతడి ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్, టెస్టుల్లో కొనసాగాలనే ఆసక్తి ఇలాగే ఉంటే.. ఈ ప్రపంచ రికార్డుపై రూట్ దృష్టి పెట్టడం అసాధ్యమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

తిలక్ వర్మపై రివేంజ్ తీర్చుకున్న వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

చిన్న భాగస్వామ్యాలే ఇలాంటి పిచ్‌పై కీలకం: హర్మన్‌ప్రీత్ కౌర్

Updated Date - Sep 11 , 2026 | 09:49 AM