Share News

జింబాబ్వేతో తొలి వన్డే: ప్రతీకా రావల్ సెంచరీ.. భారత్ ఘన విజయం

ABN , Publish Date - Oct 23 , 2026 | 07:36 PM

వడోదర వేదికగా జింబాబ్వే మహిళలతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది.

జింబాబ్వేతో తొలి వన్డే: ప్రతీకా రావల్ సెంచరీ.. భారత్ ఘన విజయం
India Women vs Zimbabwe Women 1st ODI,

ఇంటర్నెట్ డెస్క్: వడోదర వేదికగా జింబాబ్వే మహిళలతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. 198 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 27.1 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి చేధించింది. ఓపెనర్ ప్రతీకా రావల్(100*) అజేయ సెంచరీతో చెలరేగింది. షఫాలీ వర్మ(64*) హాఫ్ సెంచరీతో రాణించింది. వీరిద్దరూ కలిసి 70 బంతుల్లో 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


కెప్టెన్ స్మృతి మంధాన(32) పర్వాలేదనిపించింది. కాగా పడిన ఆ ఒక్క వికెట్ జింబాబ్వే బౌలర్ ఛేర్ తీసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 197 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. బిజా(62) హాఫ్ సెంచరీ చేసింది. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో శ్రీచరణి 4, క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 2, షఫాలీ వర్మ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

బీసీసీఐ జూనియర్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా భారత మాజీ పేసర్

అంతర్జాతీయ క్రికెట్‌కు భారత మహిళా ప్లేయర్ రిటైర్‌మెంట్

Updated Date - Oct 23 , 2026 | 07:45 PM