Share News

జింబాబ్వేతో తొలి వన్డే: చెలరేగిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:29 PM

గుజరాత్‌లోని వడోదర వేదికగా భారత్-జింబాబ్వే మహిళా జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది.

జింబాబ్వేతో తొలి వన్డే: చెలరేగిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
India vs Zimbabwe Women 1st ODI

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని వడోదర వేదికగా భారత్-జింబాబ్వే మహిళా జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. 49.5 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు 198 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లు చెలరేగి ప్రదర్శన చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ జింబాబ్వే బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు.


భారత బౌలర్ల ధాటిని ఎదుర్కొని బిజా(62; 92 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేసింది. ఆమెనే టాప్ స్కోరర్ కూడా. ముపాచికా(25), తిరిపనో(21), నైషా(13), మావుంగా(29), మకుషా(10) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లు పోటీ పడి మరీ వికెట్లు పడగొట్టారు. లో శ్రీచరణి 4, క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 2, షఫాలీ వర్మ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

స్మిత్ క్యాచ్ వ్యవహారం.. భయంతోనే ముఖం తిప్పుకున్నా: బవుమా

ఆ విషయంలో కోహ్లీ మాట తప్పాడు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

Updated Date - Oct 23 , 2026 | 05:52 PM