బీసీసీఐ జూనియర్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా భారత మాజీ పేసర్
ABN , Publish Date - Oct 23 , 2026 | 06:08 PM
బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ పర్వీందర్ అవానాను నియమించింది.
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ పర్వీందర్ అవానాను నియమించింది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రక్రియ అనంతరం అవానా పేరును సిఫార్సు చేసింది. ఈ కమిటీలో కృష్ణ దాస్, రాకేశ్ పటేల్, ఎన్. అర్జున్ యాదవ్‌లకు కూడా సభ్యులుగా అవకాశం కల్పించింది. మరో సభ్యుడిని త్వరలో నియమించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
మాజీ పేసర్ పర్వీందర్ అవానా భారత్ తరఫున రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లే ఆడటం గమనార్హం. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 62 మ్యాచ్‌లు ఆడి 191 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇండియా-ఏ, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లలోనూ ఆడాడు. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత పర్వీందర్ కోచింగ్ వైపు అడుగులు వేశాడు. ఢిల్లీ అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు కోచ్‌గా పనిచేశాడు. భారత అండర్-19 జట్టు, బీసీసీఐ హై పెర్ఫార్మెన్స్ కార్యక్రమాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కార్యక్రమాల్లోనూ సేవలు అందించాడు. ఈ అనుభవం ఇప్పుడు జూనియర్ ఆటగాళ్ల ఎంపికలో ఉపయోగపడనుంది.
ఇవి కూడా చదవండి:
స్మిత్ క్యాచ్ వ్యవహారం.. భయంతోనే ముఖం తిప్పుకున్నా: బవుమా
ఆ విషయంలో కోహ్లీ మాట తప్పాడు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు