కివీస్‌తో మూడో టీ20: టాస్ నెగ్గిన భారత్.. వైభవ్ ఆడుతున్నాడా?
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:02 PM
వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు మూడో టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు మూడో టీ20లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని పట్టుదలతో ఉంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ స్థానంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మరోసారి అవకాశం దక్కింది. రెండో టీ20లో వన్‌డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన వైభవ్.. నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.
భారత్ తుది జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
న్యూజిలాండ్ తుది జట్టు:
మిచెల్ శాంట్నర్(కెప్టెన్), టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జాకబ్స్, బ్రేస్‌వేల్, జెమీసన్, ఆడమ్ మిల్నే, డఫీ, ఫిషర్
ఇవి కూడా చదవండి:
ధోనికి ఉన్న ఆ సూపర్ పవర్ నాకూ కావాలి: ఫాఫ్ డుప్లెసిస్
వైభవ్ కాదు.. జట్టుకు ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అవసరం: భారత మాజీ క్రికెటర్