క్రికెట్ అభిమానులకు క్రేజీ అప్‌డేట్.. నేడు టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:40 PM
క్రికెట్ అభిమానులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. విశాఖపట్నం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 28న నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి రెండో దశ టికెట్లను ఇవాళ(ఆదివారం) సాయంత్రం 5 గంటలకు విక్రయించనున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: భారత్, న్యూజిలాండ్(India vs New Zealand) మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో టీమిండియానే విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 208 పరుగుల భారీ టార్గెట్‌ను నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే భారత జట్టు ఛేదించింది. ఇవాళ(ఆదివారం) గువాహటి వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచి.. సిరీస్‍ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఇది ఇలా ఉంటే.. క్రికెట్ అభిమానులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. వైజాగ్ వేదికగా జరిగే మ్యాచుకు సంబంధించిన టికెట్ల విక్రయం(India New Zealand 4th T20 ticket sale) ప్రారంభం కానుంది.
విశాఖ పట్నం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి రెండో దశ టికెట్లను ఇవాళ(ఆదివారం) సాయంత్రం 5 గంటలకు విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. కనిష్టం ధర రూ.1,200 నుంచి గరిష్టంగా రూ.15,000 వరకు వివిధ డినామినేషన్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోని మొత్తం 18 స్టాండ్‌లతో పాటు కార్పొరేట్ బాక్స్ టికెట్లను కూడా ఈ విడతలో విక్రయించనున్నారు. వైజాగ్ స్టేడియం మొత్తం సామర్థ్యం 27,251. ఇప్పటికే ఈ నెల 23న జరిగిన తొలి దశ విక్రయాల్లో చాలా వరకు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. జనవరి 28న జరిగే నాలుగో మ్యాచ్ ఆడేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు ఈ నెల 26న విశాఖ చేరుకోనున్నాయి. 27న ఇరు జట్లు ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో(Vizag 2026 cricket match) ప్రాక్టీస్ చేయనున్నాయి. 28వ తేదీ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి