జొకోః400
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:30 AM
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయాల్లో ఇప్పటికే సెంచరీ దాటేసిన నొవాక్ జొకోవిచ్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్ చేరడం ద్వారా...
నొవాక్ ‘గ్రాండ్‌స్లామ్’ రికార్డు
ప్రీక్వార్టర్స్‌కు సినర్, స్వియటెక్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయాల్లో ఇప్పటికే సెంచరీ దాటేసిన నొవాక్ జొకోవిచ్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్ చేరడం ద్వారా గ్రాండ్‌స్లామ్స్ పరంగా మరో మైలురాయిని అందుకున్నాడు. శనివారం జరిగిన సింగిల్స్ మూడో రౌండ్లో 4వ సీడ్ జొకోవిచ్ 6-3, 6-4, 7-6(4)తో బొటిక్ వాన్ డె జాండషల్ప్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. 38 ఏళ్ల జొకోవిచ్‌కు ఇది గ్రాండ్‌స్లామ్స్‌లో 400వ గెలుపు. దీంతో గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా నొవాక్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన గెలుపోటముల రికార్డును 102-10కు పెంచుకొని రోజర్ ఫెడరర్‌తో సమంగా నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ జానిక్ సినర్ 4-6, 6-3, 6-4, 6-4తో ఎలియట్ స్పిజిరిపై, ముసెట్టి 5-7, 6-4, 6-2, 5-7, 6-2తో టొమాస్‌పైౖ నెగ్గి ప్రీక్వార్టర్స్ చేరారు. 9వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 7-6 (5), 2-6, 6-4, 6-4తో స్టాని స్లాస్ వారింకాను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ స్వియటెక్ 6-1, 1-6, 6-1తో అన్నా కలిన్‌స్కయాపై, డిఫెండింగ్ చాంప్ మాడిసన్ కీస్ 6-3, 6-3తో ప్లిస్కోవాపై, 4వ సీడ్ అనిసిమోవా 6-1, 6-4తో స్టెర్న్స్‌పై, 5వ సీడ్ రిబకినా 6-2, 6-3తో తరెజాపై, 6వ సీడ్ పెగులా 6-3, 6-2తో ఒక్సానాపై గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. రెండుసార్లు విజేత నవోమి ఒసాక గాయం కారణంగా మూడో రౌండ్ ఆడకుండానే టోర్నీ నుంచి వైదొలగింది.
యుకీ ముందుకు.. బాలాజీ ఇంటికి: పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యుకీ భాంబ్రీ/గొరాన్సన్ (స్వీడన్) జోడీ మూడో రౌండ్ చేరగా.. మరో భారత స్టార్ శ్రీరామ్ బాలాజీ/నీల్ (ఆస్ట్రియా) ద్వయం రెండోరౌండ్లోనే వెనుదిరిగింది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: బంగ్లాదేశ్‌పై వేటు.. స్కాట్లాండ్‌ను రిప్లేస్‌మెంట్‌గా ప్రకటించిన ఐసీసీ
ఇది టీమిండియాకు శుభపరిణామం.. సూర్య ఫామ్‌పై స్పందించిన సునీల్ గావస్కర్